
హోమ్లీ క్యారెక్టర్స్‌కి కేరాఫ్‌లా ఉండే కీర్తి సురేష్.. తన ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా కనిపించింది ‘సర్కారువారి పాట’లో. ఆమె గ్లామరస్ పాత్రలకి సూట్ కాదనే కామెంట్స్‌కి కళావతి క్యారెక్టర్‌తో చెక్ పెట్టేసింది. అయితే గ్లామరస్‌గా కనిపించడంలో అభ్యంతరం లేదు కానీ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయంటోంది కీర్తి. ఈ మధ్య ఓ సందర్భంలో గ్లామర్ పాత్రల విషయంలో ఆమె మాట్లాడిన మాటలు మిస్‌ఫైర్ అవ్వడంతో ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. గ్లామరస్ క్యారెక్టర్స్ చేయడానికి తనకేం అభ్యంతరం లేదని, స్కిన్ షో మాత్రం చేయడం తనకి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు.. స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించడం గురించి కూడా మాట్లాడింది. ఇప్పుడున్నట్టు రేపు ఉండదని, మంచి అవకాశాలు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని, అందుకే ‘అన్నాత్తే’లో రజినీకాంత్‌కి, ‘భోళాశంకర్’లో చిరంజీవికి చెల్లెలిగా నటించడానికి ఎస్ చెప్పానని అంది. దాన్ని బట్టి తాను చేసే రోల్స్ విషయంలో కీర్తి ఎంత ప్లానింగ్‌తో ఉందో అర్థమవుతోంది. అంతే కాదు.. ఎప్పటికప్పుడు వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటోంది. రీసెంట్‌గా ‘చిన్ని’లో క్రూరంగా హత్యలు చేసే అమ్మాయిగా డీ గ్లామరస్ రోల్‌లో కనిపించింది. ‘వాశి’లో లాయర్ పాత్ర పోషిస్తోంది. ‘మా మన్నన్’లోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది. అంతేకాదు.. అతి త్వరలో ఆమె ఓ స్టార్ హీరోతోనూ జోడీ కట్టబోతోందనే ప్రచారం జరుగుతోంది. నటనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా జాగ్రత్తగా అడుగులు వేస్తే.. తన పేరులో ఉన్న కీర్తిని కెరీర్‌లోనూ సొంతం చేసుకోవడం ఖాయం.