
బడా నిర్మాణ సంస్థల నుంచి దక్షిణాది తారలకు ఆఫర్లు వెల్లువ మొదలైంది. తొలి సినిమాతోనే నయన్ 1000 కోట్ల క్లబ్లో చేరింది. రష్మిక అదే నంబర్కు చేరువలో ఉంది. ఇప్పటికే 'యానిమల్' 800 కోట్ల మార్క్ని దాటేసింది. మరో 200 కోట్లు సునాయాసంగా చేధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అలా నయన్..రష్మిక పేర్లు నార్త్లో ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఇప్పుడీ భామల సక్సెస్ని కొనసాగించాల్సిన బాధ్యత కీర్తి సురేశ్ (Keerthy Suresh) అలియాస్ కళావతిపై అంతే ఉంది. ఈ అమ్మడు బాలీవుడ్లో లాంచ్ అవుతోంది 'అక్క' అనే వెబ్ సిరీస్ సహా కొన్ని సినిమాలకు సైన్ చేసింది.
మహానటితో నార్త్లోనే పేమస్ అయిన కీర్తికి ఇది మంచి అవకాశం. అక్కలో రాధికా ఆప్టేతో పోటీ పడుతుంది. ఎందులోనూ తక్కువ కాకుండా రాధికని మించిన గొప్ప పెర్పార్మర్గా నిలవాలని కసిగానే ఉంది. ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేయడంలో రష్మిక ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. పుష్పతో లాంచ్ అయిన తర్వాత అమ్మడు హిందీ సినిమాలు రిలీజ్ కాకుండానే బాలీవుడ్ మీడియాని ఆకట్టుకుంది.
అంతేకాకుండా..సోషల్ మీడియాలో తనదైన మార్క్ ఎలివేషన్లతో కుర్రాళ్లని ఆకర్షించి ఫ్యాన్ బేస్ను పెంచుకుంది. రష్మికతో పోల్చితే కీర్తి చాలా వెనుకబడి ఉంది. ఈ అమ్మడు ఇప్పుడు హిందీ ఆడియన్స్ లోనూ ముందొస్తుగా క్రేజ్ ని దక్కించుకోలగాలి. అలా కీర్తి ఆలోచించి అడుగులేస్తుందా..? లేదా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్!