టైగర్ ష్రాఫ్‌‌‌‌ మూవీలో కృతి ప్లేస్‌‌‌‌లో కీర్తి

 టైగర్ ష్రాఫ్‌‌‌‌ మూవీలో కృతి ప్లేస్‌‌‌‌లో కీర్తి

వరుస  కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది కీర్తి సురేష్.  ఓ వైపు ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తూనే, మరోవైపు స్టార్ హీరోలకు జోడీగానూ అలరిస్తోంది.  తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె రెండేళ్ల క్రితం ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజాగా కీర్తి  మరో హిందీ సినిమాకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్‌‌‌‌తో కలిసి హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో నటించబోతోందట.  

ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ మూవీలో కీర్తి సురేష్​ పాత్ర కూడా హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం కోసం ముందుగా కృతి శెట్టిని సెలెక్ట్ చేయగా చివరి నిమిషంలో  ఆమెను తప్పించి కీర్తి సురేష్​ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈనెల 21 నుంచి  ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మరోవైపు కీర్తి సురేష్   ప్రస్తుతం  విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్థన్’ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు ఓ తమిళ, మలయాళ సినిమాలు చేస్తోంది. సౌత్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్‌‌‌‌కు  టైగర్ ష్రాఫ్  మూవీ అయినా  బాలీవుడ్‌‌‌‌లో సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.