మన రాత మనమే రాసుకోవాలె

మన రాత మనమే రాసుకోవాలె

హైదరాబాద్: కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న గుడ్ లక్ సఖి ట్రైలర్ విడుదలైంది. షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు.  నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి.. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దేశం గర్వపడే షూటర్ ను తయారు చేస్తానంటూ జగపతిబాబు చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో గ్రామీణ యువతి పాత్రలో కీర్తి పలికిన డైలాగులు, ఆమె కనబర్చిన హావభావాలు సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచే విధంగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

మరిన్ని వార్తల కోసం..

ఫిబ్రవరి 15 తర్వాత కరోనా కేసులు తగ్గుతయ్

సమాజ సేవ మా బ్లడ్‌లోనే ఉంది

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్