సమాజ సేవ మా బ్లడ్‌లోనే ఉంది

సమాజ సేవ మా బ్లడ్‌లోనే ఉంది

కరోనా టైమ్‌లో రియల్ హీరోలా ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న సోనూ సూద్.. తన సోదరి మాల్విక సూద్ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోగా సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆమెను గెలిపించేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన సోదరి రాజకీయాల్లోకి రావడం వెనుక కారణాన్ని వివరించారు. తన తల్లిదండ్రుల బాటలోనే సోదరి మాల్విక కూడా సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకుందన్నారు. తన తల్లి ఒక ప్రొఫెసర్ అని, ఆమె తన జీవితమంతా పిల్లలకు చదువు చెప్పడంలోనే సాగిపోయిందని, తన తండ్రి ఒక సోషల్ వర్కర్ అని చెప్పారు. మోగా సిటీలో స్కూళ్లు, కాలేజీలు, ధర్మశాలలు చాలా వరకు తమ సొంత స్థలాల్లో కట్టించినవేనని, సమాజ సేవ అనేది తమ రక్తంలోనే ఉందని అన్నారు. సిటీలో క్యాంపులు పెట్టి మరీ భారీగా వ్యాక్సినేషన్ జరిగేలా తన సోదరి మాల్విక బాధ్యత తీసుకుందని, ఇప్పుడు తను సిటీని భారీ స్థాయిలో డెవలప్ చేయాలని నిర్ణయించుకుందని సోనూ చెప్పారు. ప్రజలు తను సిస్టమ్‌లో భాగం కావాలని ముందుకు నడిపిస్తున్నారన్నారు.

సిటీని డెవలప్ చేయడం కోసం..

‘‘నేను మోగా సిటీలోనే ఉంటున్నా. నేను చాలా చోట్ల క్యాంపులు పెట్టి భారీగా కరోనా వ్యాక్సినేషన్ చేయించాను. నేను, సోనూ భాయ్.. ఇక్కడ ఒక ఆస్పత్రి కట్టించాలనుకున్నాం. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను కోరుకున్న స్థాయిలో డెవలప్‌మెంట్ లేదు. ఈ విషయాలపై సోనూ భాయ్‌తో మాట్లాడాను. మన ఇద్దరిలో ఒకరు సిస్టమ్‌లో భాగం అయ్యేంత వరకూ అనుకున్నంత స్థాయిలో సిటీని డెవలప్ చేయలేమని చెప్పా. నేను ఇక్కడే పుట్టి పెరిగా, ఆ సిస్టమ్‌లోకి వచ్చేది నేనే ఎందుకు కాకూడదన్న నిర్ణయానికి వచ్చాను. వీలైనంత ఎక్కువ మంది సాయం చేయడానికి ఇదే మార్గమని డిసైడ్ అయ్యాను” అని మాల్విక సూద్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ఫిబ్రవరి 15 తర్వాత కరోనా కేసులు తగ్గుతయ్

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్