ఫిబ్రవరిలో కరోనా విజృంభనకు కళ్లెం

ఫిబ్రవరిలో కరోనా విజృంభనకు కళ్లెం

ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 20శాతాన్ని దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఫిబ్రవరి 15 తర్వాత కొవిడ్ కేసులు తగ్గుముఖం పడతాయని ప్రకటించింది. ప్రస్తుతం మెట్రో సిటీల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని చెప్పింది. వ్యాక్సినేషన్ కారణంగా మూడో దశ ప్రభావం తగ్గిందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ సమన్వయంతో దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారిలో 74శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు చెప్పింది.