పొలిటికల్ ఎంట్రీపై కీర్తి కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన తల్లి మేనక

పొలిటికల్ ఎంట్రీపై కీర్తి కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన తల్లి మేనక

రాజకీయాలపై మహానటి కీర్తి సురేష్(Keerthi suresh) ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ తాజాగా నటించిన మూవీ మామన్నన్(Maamannan). ఉదయనిధి స్టాలిన్(Udayanidi stallin) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను.. తమిళ స్టార్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్(Mari selvaraj) తెరకెక్కిస్తున్నాడు. భారీ  అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. 

ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఇంటర్వ్యూలో పాల్గొంది కీర్తి సురేష్. ఇందులో భాగంగా ఆమెకు చిత్రమైన ప్రశ్న ఎదురైంది. మామన్నన్ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తుంది కదా.. మీరు నిజ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని యాంకర్ అడిగింది. దానికి సమాధానంగా కీర్తి సురేష్.. ఆ విషయం గురించి ఆలోచించాలని చెప్పుకొచ్చింది. 

దీంతో ఆమె నిజంగా రాజకీయాలలోకి రానుంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు ప్రచారం జరగడానికి కారణమూ లేకపోలేదు . ప్రస్తుతం ఆమె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అందుకే.. రాబోయే రోజుల్లో కీర్తి పొలిటికల్‌ ఎంట్రీ ఉండవచ్చనే ప్రచారం ఊపందుకుంది.

అయితే కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ఆమె తల్లి మేనక(keerthi mother menaka) స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, తమ కూతురుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదని స్పష్టం చేసింది.