7 కిలోల బరువు తగ్గాను మరో 7 రోజుల పాటు బెయిల్ పొడగించండి

7 కిలోల బరువు తగ్గాను మరో 7 రోజుల పాటు బెయిల్ పొడగించండి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కాంలో తనకు ఇచ్చి మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజులకు పొడగించాలని కోర్టులో పిటిషన్ వేశారు.  తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్‌లో తెలిపారు.తాను 7 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కీటోన్‌ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్‌ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. 

పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్‌ గడువును మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీంను కోరారు.మరోవైపు కేజ్రీవాల్ కు మంజూరు చేసిన బెయిల్ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆప్ నేతల్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు పార్టీ నేత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పార్టీ నాయకులపై  పార్టీ అద్యక్షుడిపై విమర్శలు చేయడంతో రాజకీయంగా రోజూ హీట్ నడుస్తుంది.