కేంద్రీయ విద్యాలయాల్లో ఉత్తమ విద్య : కలెక్టర్ కుమార్ దీపక్

కేంద్రీయ విద్యాలయాల్లో ఉత్తమ విద్య : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్‌‌, వెలుగు: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూళ్లలో క్రమశిక్షణతో కూడిన విద్య అందుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయం కొత్త భవనాన్ని షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ప్రిన్సిపాల్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాల్లో విద్యభ్యసించిన వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని, విద్యతో పాటు క్రీడలు, కళలు, ఇతర రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. 

విస్తృత తనిఖీలు

హాజీపూర్ ​మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. పడ్తనపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమికోన్నత స్కూల్, భవిత కేంద్రం, సబ్బెపల్లి గ్రామంలోని జిల్లా జడ్పీ హైస్కూల్​ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, హాజరు, పరిసరాలను పరిశీలించారు. 

మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను స్పీడప్​ చేయాలని ఆదేశించారు.