
ఆమె వయస్సు 111ఏళ్లు. కేరళలోని కాసరగోడ్ లోని అతిపెద్ద ఓటరు.1957లో జరిగిన కేరళ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తొలిసారి ఓటు వేసింది. దశాబ్దాలుగా ఒక్క అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను వదలకుండా ఓటు వేసింది ఈమె. 111 యేళ్ల వయసులో కూడా ఓటే వేసేందుకు ఉవ్విళ్లూరుతోంది కేరళకు చెందిన కుప్పుచ్చి. తెలిసిన వారందరూ కుప్పుచ్చియమ్మ అని ముద్దుగా పిలుచుకునే ఈ అతిపెద్ద ఓటరు మరోసారి వేలిపై సిరా వేయించుకునేందుకు సిద్దమవుతోంది.
కేరళకు చెందిన కుప్పుచ్చి... 1957 నుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంటోంది. ఎన్నికలొచ్చిన ప్రతీసారి తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేది.. అయితే గత ఎన్నికల్లో ఆమె వయోభారం దృష్ట్యా ఇంటినుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి కూడా ఇంటినుంచే ఓటు వేయనున్నారు.
వ్యవసాయ సంస్కరణ కేరళ ముఖ్యమంత్రి నంబూద్రి ప్రసాద్ కు ఈమె గొప్ప అభిమాని. కుప్పుచ్చి అమ్మ కమ్యూనిస్టు భావజాలం కలిగిని వ్యక్తి. 2022లో కుప్పుచ్చియమ్మ కు ప్రజాస్వామ్యం పట్ట అచంచలమైన నమ్మకం, నిబద్ధత చూపినందుకు ఎలక్షన్ కమిషన్ ఆమెను సత్కరించింది కూడా.