
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కజాన్ ఖాన్(Kajaan khan) జూన్ 13 మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కేరళకు చెందిన కజాన్ ఖాన్.. 1993 లో వచ్చిన గంధర్వ అనే మళయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
కజాన్ ఖాన్ మలయాళంతో పాటు.. తమిళ్,తెలుగు,కన్నడలో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన బద్రి(badri), శ్రీహరి(Srihari) లీడ్ రోల్ చేసిన భద్రాచలం(Badrachalam) వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు.
కజాన్ ఖాన్ మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.