
- అది కూడా రూ.31 వేల
- విలువైన లిక్కరే తాగుతది
- ఒక కేర్‌టేకర్, ఐదుగురు అసిస్టెంట్లు..
- రోజూ 20 లీటర్ల పాలు, 10 కిలోల ఆపిల్స్, 8 డజన్ల అరటి పండ్లు,కేజీ డ్రైఫ్రూట్స్ హాంఫట్
- ఇవాళ (అక్టోబర్ 22) నగరంలో సదర్ వేడుకలు
ముషీరాబాద్, వెలుగు : నగరంలో నేడు నిర్వహించనున్న సదర్ఉత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్ 22) రాత్రి నారాయణగూడతో పాటు ముషీరాబాద్, కాచిగూడల్లో సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వీటికి ఏర్పాట్లు పూర్తయ్యయాని సదర్ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు. ఇతర రాష్ట్రాల తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 200 పై చిలుకు భారీ దున్నలు ఈ వేడుకల్లో పాల్గొంటాయి.
అయితే, ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా కేరళ, హర్యానా, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దున్నలను నగరానికి తీసుకువచ్చారు. ప్రత్యేక కంటైనర్‌లో సుమారు 1800 కిలోమీటర్ల నుంచి ఆరు దున్నలను పట్టుకువచ్చారు. ఇందులో ఒక్కొక్క దున్నకు ఒక కేర్ టేకర్ తో పాటు ఐదుగురు అసిస్టెంట్లు ఉన్నారు.
కాళీ దున్న ప్రత్యేకతే వేరు..
కేరళ నుంచి తీసుకువచ్చిన కాళీ దున్నరాజు వారానికో సారి కాస్ట్లీ లిక్కర్ఫుల్బాటిల్లేపేస్తుంది. అది కూడా రాయల్ సెల్యూట్ 21 సంవత్సరాల పాత బాటిల్‌ను అమాంతం ఆపకుండా తాగుతుంది. దీని విలువ రూ. 31 వేల రూపాయలు..ఈ దున్న 2100 కిలోల బరువు ఉంటుంది. దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 20 లీటర్ల పాలు,10 కిలోల ఆపిల్స్, 8 డజన్ల అరటి పండ్లు, కేజీ డ్రైఫ్రూట్స్, 6 కిలోల గోధుమ పొట్టు పెడతారు.
ఈ దున్నతో పాటు మరిన్ని దున్నలను మధు యాదవ్ సదర్ఉత్సవాల కోసం కేరళ, హర్యానా, పంజాబ్‌నుంచి తెప్పించారు. ఇందులో రోలెక్స్, బాదుషా, గోల్డ్, భజరంగి, కోహినూర్ ఉన్నాయి. ఇవి కూడా కాళీ అంత కాకపోయినా అటూ ఇటుగా అంత స్టేటస్మెయింటెయిన్చేస్తున్నాయి. ఒక్కొక్క దున్నకు రోజూ ఫుడ్ కోసమే రూ. 5 వేల నుంచి రూ. 8వేలు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
వారానికి రెండు సార్లు ఐదు లీటర్ల మంచి ఆముదం నూనెతో మసాజ్ చేస్తామన్నారు. ఈ దున్నలు 1800 కిలోల నుంచి 2200 కిలోల వరకు వెయిట్ఉంటాయని, ఆరు అడుగులకు పైగా ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో భారీ ఆకారంలో ఉంటాయన్నారు.