కేరళ సీఎం ఏదో దాస్తున్నారు.. జేపీ నడ్డా సంచలన ఆరోపణలు

కేరళ సీఎం ఏదో దాస్తున్నారు.. జేపీ నడ్డా సంచలన ఆరోపణలు

మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ హేమ కమిటీ నివేదికపై కేరళ ప్రభుత్వంపై మండి పడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రకాష్ నడ్డా.. ఆదివారం (సెప్టెం బర్1) న కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన నడ్డా..కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.సీపీఎం నేత ప్రమేయం ఉన్నందున సీఎం పినరయి విజయ్ ఏదో దాస్తున్నారని ఆరోపించారు. మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో కమ్యూ నిస్టు పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉందని హేమా కమిటీ  చాలా స్పష్టం గా చెప్పిందన్నారు. 

మాలివుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై విచారణ చేపట్టిన జస్టిస్ హేమ కమిటి నివేదిక అనేక విషయాలను బయట పెట్టింది. లేడీ ఆర్టిసుల వేధింపుల కేసులో కమ్యూనిస్టు పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉందని జస్టిస్ హేమ కమిటి నివేదికలో స్పష్టం చేసిందన్నారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. 

ALSO READ | Khushbu Sundar: జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై..స్పందించిన నటి ఖుష్బూ

ఆగస్ట్19న నివేదిక విడుదలైన తర్వాత వివిధ మహిళలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులు, దర్శకులు, ప్రొడక్షన్ కంట్రో లర్లు మొదలైన మలయాళ సినీ ప్రముఖులపై ఇప్పటివరకు కనీసం 10 కేసులు నమోదయ్యాయి. దర్శకులు వీకే ప్రకాష్, రంజిత్, నటులు సిద్ధిఖీ, ముఖేష్, జయసూర్య, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు, అడ్వకేట్ చంద్రశేఖరన్, ప్రొడక్షన్ కంట్రోలర్లు నోబుల్, విచ్‌లపై లైంగిక ఆరోపణలు వచ్చాయి.