గవర్నర్ను ఛాన్స్లర్ పదవి నుంచి తొలగిస్తూ కేరళ సర్కార్ ఆర్డినెన్స్

గవర్నర్ను ఛాన్స్లర్ పదవి నుంచి తొలగిస్తూ కేరళ సర్కార్ ఆర్డినెన్స్

కేరళ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా గవర్నర్కు షాకిస్తూ.. సీఎం పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్స్లర్ పదవి నుంచి గవర్నర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ స్థానంలో కళలు, సాంస్కృతి రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని నియమించనున్నట్లు పేర్కొంది.

రాష్ట్రంలో యూనివర్సిటీల ఛాన్స్లర్గా గవర్నర్ను తొలగించడానికి ఓ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ పదవిలో ఆయన కొనసాగాలని తాము భావించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 9 యూనివర్సిటీల వీసీలను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిర్ణయించగా..దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీసీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం పెరుగుతూ వస్తోంది.