ఎందుకీ అలర్ట్..: ఆస్పత్రుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి

ఎందుకీ అలర్ట్..: ఆస్పత్రుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి

కేరళ ఆరోగ్య శాఖ కీలక  ప్రకటన చేసింది.  ఆసుపత్రులను సందర్శించే వారికి మాస్క్‌లను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ, హెచ్1ఎన్1 వంటి అంటు వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆరోగ్య మంత్రి వీణా జార్జ్  ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టి)తో జరిగిన  రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..   పిల్లలలో జ్వరాలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు.  అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు కోలుకునే వరకు పాఠశాలకు పంపవద్దని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు. 

అంటువ్యాధులను నివారించడానికి, సోకిన వారికి మెరుగైన చికిత్సను నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మంత్రి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా అలప్పుజా, కొట్టాయం జిల్లాలలో బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని కోరారు.పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకునే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.