మానవత్వం లేదా: వయనాడ్ బాధితులను అప్పుల కోసం పీడిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు

మానవత్వం లేదా: వయనాడ్ బాధితులను అప్పుల కోసం పీడిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు

ప్రైవేట్ ఫైనాన్సర్లకు కేరళ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమానవీయంగా వయనాడ్ బాధితులను ఇబ్బంది పెడితే ల్యాండ్ స్లైడ్ బాధితులను బలవంతం గా రుణాలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని బుధవారం ఆగస్టు 7, 2024న హెచ్చరించింది. 

ల్యాండ్ స్లైడ్ బాధిత రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిపై ప్రైవేట్ ఫైనాన్సర్లు రుణాలుచెల్లించాలని వత్తిడి తేవడం పై కేరళ ప్రభుత్వం దృష్టికి రావడంతో సీరియస్ గా తీసుకుంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి పీఎ మహమ్మద్ రియాజ్ సోషల్ మీడియాలో తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో ఇటువంటి చర్యలు సరియైంది కాదని .. బాధితులపై ఒత్తిడి తెస్తే.. కఠిన చర్యలు తప్పవని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. 

ALSO READ | Kerala Landslides: వారం రోజుల్లోనే LIC పాలసీ డబ్బులు ఇచ్చేయండి.. : వయనాడ్ పై కేంద్రం ఆదేశం

వయనాడ్ లో జూలై 30న, 2024న కొండచరియలు విరిగిపడి ప్రాణాలతో బయటపడిన వారికి కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఫోన్ చేసి తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని వత్తిడి తెస్తున్నారని ప్రభుత్వం దృష్టికి రావడంతో ఫైనాన్సర్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవని తెలిపింది.