జర్నలిస్టులపై కేరళ హైకోర్టు కీలక తీర్పు​

జర్నలిస్టులపై కేరళ హైకోర్టు కీలక తీర్పు​

విచారణ పేరుతో జర్నలిస్టుల ఫోన్లు సీజ్​చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభంలో భాగమని తెలిపింది. ఏదైనా కేసులో వారి ఫోన్​ అవసరమైతే క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ (సీఆర్​పీసీ) నిబంధనలను అనుసరించాలని కోర్టు తెలిపింది. ఓ యూట్యూబర్​పై స్థానిక ఎమ్మెల్యే వేసిన కేసులో తనకు సంబంధం లేకపోయినా పోలీసులు వేధించారని జి. విశాఖన్​ అనే మలయాళ జర్నలిస్టు ఆరోపించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు జరిపి ఫోన్​ సీజ్​ చేశారని హైకోర్టును ఆశ్రయించాడు.