
గత కొన్ని రోజులుగా మలయాళ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మీటూ వ్యవహారంలో కేరళకి చెందిన ప్రముఖ సినీ నటుడు సిద్ధిక్, దర్శకుడు రంజిత్ మరియు ముఖేష్, తదితరులతో కలిపి దాదాపుగా 15 మంది ఈ లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకున్నారు. దీంతో ఒక్కసారిగా కేరళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.
అయితే ఇందులో నటుడు సిద్ధిక్ ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. కానీ ఈ బెయిల్ పిటీషన్ ని పరిశీలించిన కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. అలాగే సిట్ దర్యాప్తు జరుగుతున్న సమయంలో ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యడం కుదరదని అందుకే నటుడు సిద్ధిక్ ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టివేసినట్లు తెలిపింది.
ALSO READ | మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది: సుప్రీంకోర్టు
ఈ విషయం ఇలా ఉండగా ఆగస్టు 19న కేరళ సినీ పరిశ్రమలో ఈ మీటూ ఉద్యమంలో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు బయటివచ్చాయి. దీంతో సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కున్న పలువురు మహిళలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దాదాపుగా 20 మందికి పైగా ప్రముఖులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో పేరు బయటిస్తోంది.