బ్యాంకాక్ నుంచి గంజాయి తెస్తూ దొరికిన మోడల్..పట్టుబడిన గంజాయి విలువ రూ.11.82 కోట్లు

బ్యాంకాక్ నుంచి గంజాయి తెస్తూ దొరికిన మోడల్..పట్టుబడిన గంజాయి విలువ రూ.11.82 కోట్లు

ముంబై: బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న ఓ మోడల్‌‌‌‌ను కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ ఎయిర్​పోర్టులో అరెస్టు చేశారు. కేరళకు చెందిన మోడల్​హర్ష సన్నీ గురువారం రాత్రి బ్యాంకాక్ నుంచి గంజాయితో ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అనుమానాస్పదంగా కన్పించడంతో ఆమె లగేజీని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు చెక్​చేశారు.

ఆమె ట్రాలీ బ్యాగ్​లో వాక్యూమ్ సీల్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లలో 11 కిలోల హైడ్రోపోనిక్ మారిజువానా (గంజాయి) బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో దాని విలువ సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద హర్ష సన్నీపై కేసు నమోదు చేశారు. ఇంత భారీ మొత్తంలో గంజాయిని ఎవరికోసం తీసుకొచ్చారు? ఎవరి నెట్​వర్క్ లో ఆమె పనిచేస్తున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హర్ష సన్నీ 2025లో జరిగిన ‘మిసెస్ కేరళ’ పోటీల్లో పాల్గొన్నారు.