
కరోనా మహమ్మారి తగ్గిందనే లోపే రోజుకో కొత్త వేరియంట్ లు, వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా కేరళలో నిపా వైరస్ కలకల రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు నిపా వైరస్ తో మృతి చెందినట్లు డాక్టరలు అనుమానిస్తున్నారు. మృతులలో ఒకరి బంధువులు ఐసీయూలో ఉన్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read : హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు
వెంటనే అలర్ట్ అయిన కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో 2018లో కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో నిపా వ్యాప్తి చెందగా.. ఆ తర్వాత 2021లో కూడా కోజికోడ్‌లో నిపా కేసు నమోదైందని గుర్తించారు. సౌత్ ఇండియాలో మొదటి నిపా వైరస్ వ్యాప్తి మే 19, 2018న కోజికోడ్‌లో నమోదైందని వైద్యులు గుర్తించారు. మరణాలకు సంబంధించి కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎక్స్ పర్ట్ కమిటీని వేసింది.దీనికి సంబంధించిన డీటేల్స్ ఇవాళమధ్యాహ్నాం రానున్నాయి.
నిపాతో వచ్చే అనారోగ్య సమస్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం నిపా వైరస్ సంక్రమణ అనేది జంతువుల నుండి ప్రజలకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి. కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తి నుండి వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది. సోకిన వ్యక్తులలో ఎలాంటి లక్షణాల్లేకుండా (సబ్‌క్లినికల్) ఇన్‌ఫెక్షన్ నుంచి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వరకు అనేక రకాల అనారోగ్యాలను కలిగిస్తుంది.
నిపా వైరస్ అంటే..
నిపా అనేది పారామిక్సోవైరస్. ఇది జలుబుకు కారణమయ్యే కొన్ని వైరస్‌లలో ఒకటైన హ్యూమన్ పారాఇన్‌ఫ్లూయెంజా వైరస్‌కి సంబంధించినది. ఇప్పటి వరకు వైరస్ సోకిన గబ్బిలాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్ష కాంటాక్ట్ తో నిపా వైరస్ మనుషులకు సోకినట్లు గుర్తించారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్ల మీదకు చేరినప్పుడు ఆ పండ్లు,పళ్ల రసాల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది.
నిపా వైరస్ కేంద్ర నాడీ కణజాలాలలో కేంద్రీకృతమై ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిపా వైరస్ సోకుతుంది. నిపా వైరస్ కు టీకాలు, చికిత్స లేకపోవడం భయాందోళకు గురి చేస్తోంది