రాష్ట్రానికి ఫారిన్ సెక్రటరీ ఏంటీ.. కేరళ ఏమైనా ప్రత్యేక దేశమా..? : బీజేపీ

రాష్ట్రానికి ఫారిన్ సెక్రటరీ ఏంటీ.. కేరళ ఏమైనా ప్రత్యేక దేశమా..? : బీజేపీ

కేరళ ప్రభుత్వం సొంతంగ విదేశాంగ కార్యదర్శిని నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారి కె. వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.. 

 సీఎం పినరయి విజయన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ విమర్శించారు. రాష్ట్ర  ప్రభుత్వానికి విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి  ఎలాంటి అధికారం లేదు..ఇది పూర్తిగా  రాజ్యాంగ విరుద్ధమైన చర్య. రాజ్యంగ బద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు ప్రమాదకరమన్నారు.. సీఎం పినరయి విజయన్ కేరళను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

 లేబర్ అండ్ స్కిల్స్ సెక్రటరీ ఐఏఎస్  కె. వాసుకికి  అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేరళ ప్రభుత్వం   జూలై 15న జీవో జారీ చేసింది.  విదేశీ వ్యవహారాలకు  సంబంధించిన   అంశాలను ఐఏఎస్ వాసుకి పరిశీలిస్తారని పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతారని ఉత్తర్వులో  తెలిపారు.