ప్రభుత్వ మార్పు కోసం కాదు.. కేరళ భవిష్యత్తును మార్చే ఎన్నికలివి: అమిత్ షా

ప్రభుత్వ మార్పు కోసం కాదు.. కేరళ భవిష్యత్తును మార్చే ఎన్నికలివి: అమిత్ షా

కొచ్చి: కేరళలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరచడం కోసమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2014 లోక్​సభ ఎన్నికల నుంచి కేరళలో ఎన్డీయే ఓట్ల శాతం క్రమంగా పెరుగుతోందని, ఈసారి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. 

ఈమేరకు ఆదివారం కున్నతునాడు నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. క్రైస్తవులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా.. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.