రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఎందుకు..?: కేరళ సీఎం పినరయి విజయన్

రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఎందుకు..?: కేరళ సీఎం పినరయి విజయన్

తిరువనంతపురం: రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోలు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరస్కరించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుందని.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాంటి చర్యల వల్ల ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు.

ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని పినరయి విజయన్ చెప్పారు.గతంలో లైఫ్ మిషన్ పథకం కింద నిర్మించే ఇళ్లపై పీఎంఏవై లోగోను ఉంచాలన్న కేంద్రం ఆదేశాలను కూడా కేరళ ప్రభుత్వం తిరస్కరించింది.  

ఉచిత రేషన్ పథకాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా  రేషన్ షాపుల ముందు ప్రధాని ఫొటో, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటును తప్పని సరి చేయడంతోపాటు కేంద్రం లోగోతో కూడిన బ్యాగులను కూడా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.