టికెట్ చిచ్చు.. రన్నింగ్‌ ట్రైన్ నుండి TTEని తోసేసిన ప్యాసెంజర్

టికెట్ చిచ్చు.. రన్నింగ్‌ ట్రైన్ నుండి TTEని తోసేసిన ప్యాసెంజర్

కేరళలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడు నెట్టివేయడంతో రన్నింగ్‌ ట్రైన్ నుంచి కింద పడి ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టిటిఇ) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం(ఏప్రిల్ 2) రాత్రి 7 గంటల సమయంలో ముళంగున్నతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్‌ల మధ్య జరిగింది. 

ఎర్నాకులం నుంచి పాట్నా వెళ్లే రైలు ఎస్11 కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన టీటీఈని ఈకే వినోద్‌గా పోలీసులు గుర్తించారు. టికెట్‌ విషయమై ఇద్దరి మధ్య  వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సహనం కోల్పోయిన ప్రయాణికుడు.. నెట్టడంతో టీటీఈ కదులుతున్న రైలు నుండి పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.