"నాటు నాటు" సాంగ్ నా ఫెవరేట్ లిస్టులోనే లేదు.. కీరవాణి షాకింగ్ కామెంట్స్

"నాటు నాటు" సాంగ్ నా ఫెవరేట్ లిస్టులోనే లేదు.. కీరవాణి షాకింగ్ కామెంట్స్

ఆస్కార్ అవార్డ్ సాధించిన నాటు నాటు సాంగ్ తన లిస్టులోనే లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు సంగీత దర్శకుడు MM కీరవాణి. తాజాగా ఆయన రామ్ గోపాల్ వర్మతో  ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నాటు నాటు సాంగ్ తన బెస్ట్ సాంగ్స్ లిస్ట్ లోనే లేదని కీరవాణి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆస్కార్ వెనుక నాటు నిజం అంటూ రాం గోపాల్ వర్మ కీరవాణితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో ప్రశ్నలు అడిగారు ఆర్జీవి. నాటు నాటు పాటకు మీరు కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసుంటే ఆస్కార్ పొందే అర్హత ఉందని ఫీలయ్యేవారా..? అని కీరవాణిని అడిగాడు. "నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు కీరవాణి. కేవలం పాటగా తీసుకుంటే ఆస్కర్ వచ్చినందుకు తాను ఫీల్ అవ్వనని, ఎందుకంటే జయహో పాటకి ఆస్కార్ వచ్చినప్పుడు కూడా తాను ఫీలవలేదని అన్నారు కీరవాణి.

ఇక నాట నాటు సాంగ్ మీ కెరీర్ టాప్ 100 సాంగ్స్ లో ఉందని మీరు అనుకుంటున్నారా అని ఆర్జీవి ప్రశ్నించగా.. వెంటనే లేదని చెప్పేసిన కీరవాణి.. మనం ఏదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు అవతలి వాళ్లకు నచ్చేలా చేయాలి.. కానీ అది ముందు మనకు నచ్చాలి. మనకే నచ్చకపోతే ప్రపంచానికి ఎలా నచ్చుతుందని నేను అనుకుంటానని, కొన్నిసార్లు నాకు నచ్చాలని చూస్తాను, మరికొన్ని సార్లు అవతలివాళ్లకు నచ్చాలని అనుకుంటానని అన్నారు. ఇది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందని అన్నారు కీరవాణి. ఆస్కార్ కమిటీలో దాదాపు పదివేల మంది ఓటు వేస్తారు. వీరంతా ఆస్కార్ ఎంట్రీ కోసం వచ్చిన కొన్ని సినిమాలను చూడకపోయుండొచ్చు. మా సినిమా చూసి ఓటేయండి అని మనమే ప్రచారం చేసుకోవాలి. అలా వాళ్లు ట్రిపుల్ ఆర్ సినిమా చూసే క్రమంలో నాటు నాటు సాంగ్ వచ్చే సరికి ఎంజాయ్ చేసుంటారు. సినిమా ఇంప్యాక్ట్ అంతా ఆ సాంగ్ మీద ఉండటం వల్లఆ సాంగ్ కి ఓటు వేశారని తాను నమ్ముతానని అన్నారు కీరవాణి. ప్రస్తుతం కీరవాణి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.