
- సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల విజ్ఞప్తి
ఖైరతాబాద్, వెలుగు: ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా తెలియజేయాలని తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ఆధ్వర్యంలో ‘వలస విముక్త నవ తెలంగాణ కోసం పోరాడుదాం’ పేరుతో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రజా గాయకురాలు విమలక్క , మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, హనుమాండ్లు మాట్లాడారు. కేశవరావు జాదవ్ హైదరాబాద్‌లోని హుస్సేని ఆలంలో పుట్టారని, మిస్టర్ తెలంగాణగా గుర్తింపు పొందారని గుర్తుచేశారు. ఎక్కువకాలం ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఓయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.