- పేర్సాపేన్, బాన్ దేవతలకు ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ బుధవారం భక్తులతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నాగోబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా మెస్రం వంశీయులు పేర్సాపేన్ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు.
మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకటరావు పటేల్‌తో పాటు చిన్ను పటేల్, కటోడలు కోసేరావు హనుమంతరావు ఆధ్వర్యంలో పేర్సాపేన్‌కు గంగాజలంతో అభిషేకం చేసి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. అనంతరం మహిళలు బాన్ దేవతలకు పూజలు చేశారు. నాగోబాను బుధవారం మాజీ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
