భక్తులతో కిటకిటలాడుతున్న నాగోబా జాతర

భక్తులతో కిటకిటలాడుతున్న నాగోబా జాతర

ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతర మూడో రోజైన(ఫిబ్రవరి 11) ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. ప్రతిరోజు పలు రాష్ట్రాల నుంచి వేల మందికి పైగా భక్తులు.. కంపార్ట్​మెంట్లలో క్యూ కట్టి నాగోబా దర్శనం చేసుకుంటున్నారు.

గోవాడలో బస చేసిన మెస్రం వంశీయులు టెంట్లు వేసుకొని, పిండి వంటలు చేసుకొని బంధువులు, ఆత్మీయులతో ఆనందంగా గడిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు 600 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపులు, ప్రభుత్వ శాఖల ఆధర్యంలో వివిధ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.