
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇటీవలే చాలా కొత్త రూల్స్ ప్రకటించింది. టెస్ట్ క్రికెట్ లో స్టాప్ క్లాక్, లాలాజల నియమంలో మార్పు, DRS విధానంలో కొత్త మార్పు, షార్ట్ రన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్.. మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ క్రికెట్ లో రెండు సరికొత్త రూల్స్ ను ప్రతిపాదించాడు. పవర్ ఫుల్ హిట్టర్లకు ఈ రూల్ ఊరించేలా చేస్తుంది. మరోవైపు యార్కర్లు వేసే బౌలర్లకు ఈ రూల్ అనుకూలంగా ఉంది.
100 మీటర్లు కొడితే 12 పరుగులు:
పీటర్సన్ మాట్లాడుతూ.. " నేను ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. ఒక బ్యాటర్ కొట్టిన సిక్సర్ 100 మీటర్లు దాటితే జట్టుకు ఆరు పరుగులు కాకుండా 12 పరుగులు ఇవ్వాలి. ఈ రూల్ పెడితే బ్యాటర్లు భారీ సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కు ఎక్కువ ఎంటర్ టైన్ లభిస్తుంది". అని ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ అన్నాడు. క్రికెట్ లో 100 మీటర్ల సిక్సర్లు చాలా అరుదుగా కొడుతూ ఉంటారు. పీటర్సన్ రూల్ పై భిన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ లో బేసిక్ రూల్స్ ను మార్చడమేంటి అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.
ALSO READ : ఆఫ్ఘనిస్తాన్‌తోనే పాకిస్థాన్‌కు అగ్ని పరీక్ష
మిడిల్ స్టంప్ కు బాల్ తగిలితే నెక్స్ట్ బ్యాటర్ ఔట్:
“ఒక బౌలర్ మిడిల్ స్టంప్‌ను పడగొట్టి వికెట్ తీస్తే నెక్స్ట్ వచ్చే బ్యాటర్ కూడా ఔట్ గా ప్రకటించాలి. దీని వలన బౌలర్లు ఎక్కువగా యార్కర్లు వేయడంపై దృష్టి పెడతారు". అని అన్నాడు. పీటర్సన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే బౌలర్ మిడిల్ స్టంపు ను పడగొడితే రెండు వికెట్లు తీసినట్టే. ఈ రూల్ పాయ్ కూడా నెటిజన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. టెస్టు క్రికెట్ లో అద్భుతమైన బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న పీటర్సన్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మెంటార్ గా ఉన్నాడు.