హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలు ముందుకు వెళ్లే పరీక్షలేమి కావవని, ఇటు ఇటు ఊగి చివరకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చేరుకునేలా కనిపిస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న అన్నారు. జీవో నెంబర్ 29 ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. రాజ్భవన్లో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, కుందారం గణేష్ చారి, చెరుకు సుధాకర్ గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిశారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ.. ఇప్పటికే బీసీలమంతా ఏకమయ్యామని, తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆశయాలను తెలంగాణలో నెరవేర్చబోతున్నామన్నారు.
ALSO READ | గ్రూప్-1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ
ఈ ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేసినా లేక ప్రభుత్వంలోని ఎవరూ పని చేస్తే మేమంతా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక విధానం మార్చుకోవాలని లేకుంటే మాజీ సీఎం కేసీఆర్కు ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని వార్నింగ్ఇచ్చారు. జీవో 29 ఓ చీకటి జీవో అని, ఇది బీసీల బతుకులను నాశం చేసే జీవో అన్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.