సనాతన ధర్మాన్ని విస్తరిస్తాం: టీటీడీ చైర్మన్ భూమన

సనాతన ధర్మాన్ని విస్తరిస్తాం: టీటీడీ చైర్మన్ భూమన

టీటీడీ పాలకమండలి మంగళవారం( సెప్టెంబర్ 5) సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana Krunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్తృత్తంగా వ్యాప్తి చెయ్యాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Tamilnadu Minister Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

చిన్నతనం నుంచే భక్తి భావాన్ని  పెంచేలా తిరుమలలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు టీటీడీ చూర్మన్ భూమన కరుణాకరరెడ్డి.  గోవింద కోటి రాసిన 25 సంవత్సరాల లోపల యువతి, యువకుల కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. 10 లక్షల 1116 సార్లు గోవింద కోటి రాసిన ఓ భక్తుడికి బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. విద్యార్థిని, విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేలా రాష్ట్రంలో ఎల్ కే జీ నుంచి పదో  తరగతి వరకు చదివే పిల్లలకు 20 పేజీల భగవద్గీత పుస్తకాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.