ఉగ్ర కుట్ర కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు

ఉగ్ర కుట్ర కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు

హైదరాబాద్ : ఉగ్ర కుట్ర కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా HUT సానుభూతిపరులు విధ్వంసానికి ప్లాన్ చేశారని గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్ ను అరెస్ట్ చేసి, భోపాల్ కి తరలించారు. భోపాల్ కి చెందిన యాసిర్ అనే వ్యక్తి.. హైదరాబాద్ కి అరుగురిని పంపించాడు. నిందితుల కాంటాక్ట్స్, సోషల్ మీడియా డేటాపై ఇన్వెస్ట్ గేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. టెర్రర్ లింక్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. మెడికోలను ట్రాప్ చేసేందుకే సలీం మెడికల్ కాలేజీలో జాయిన్ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఐదేండ్లుగా డక్కన్ కాలేజీలో HODగా పని చేస్తున్నాడు సలీం. ఆన్ లైన్ లో సూసైడ్ బాంబర్స్, గ్రెనేడ్ దాడులు, కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయాన్ పేరుతో మీటింగ్స్ నిర్వహించారని గుర్తించారు. మీటింగ్స్ కి ఎవరెవరు వెళ్లారనే డిటెయిల్స్ తీసుకుంటున్నారు. డక్కన్ కాలేజ్ హెచ్ఎడీగా ఉన్న సలీం ఇంట్లో మీటింగ్స్ ఎక్కువగా జరిగేవని గుర్తించారు.