సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి

సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి

టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని అప్పగించింది.  కాంగ్రెస్ మీడియా,  కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్ గా ఆయనను నియమించింది.  టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనపై  నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి,  సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  సోషల్ మీడియాలో సామ రామ్మోహన్ రెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటారు.  పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది.  

ALSO READ :- ఏపీలో మహిళా వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు