జులై 9 పై అందరి కళ్లు .. మార్కెట్‌‌‌‌లో ఈ వారం బిజీబిజీ

జులై 9 పై అందరి కళ్లు .. మార్కెట్‌‌‌‌లో ఈ వారం బిజీబిజీ

ముంబై: ఈ వారం ఈక్విటీ ఇన్వెస్టర్లకు కీలకమని ఎనలిస్టులు భావిస్తున్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 90 రోజుల టారిఫ్ సస్పెన్షన్ జులై 9న ముగియనుంది. భారత్–-అమెరికా ట్రేడ్ ఒప్పందం సానుకూల ఫలితం ఇస్తే, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లు పెరుగుతాయి. మరోవైపు టీసీఎస్‌‌‌‌,  అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ (డీమార్ట్‌‌‌‌) తమ ఏప్రిల్‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి. మార్కెట్‌‌‌‌పై క్వార్టర్లీ ఫలితాల ప్రభావం ఉంటుంది. ట్రేడర్లు విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు, గ్లోబల్‌‌‌‌ ట్రెండ్స్‌‌‌‌ను జాగ్రత్తగా గమనించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. 

జులై 9న విడుదలయ్యే యూఎస్‌‌‌‌ ఫెడ్‌‌‌‌ మినిట్స్‌‌‌‌,  బ్రెంట్ క్రూడ్ ధరలు, రూపాయి–-డాలర్ ట్రెండ్ కూడా కీలకం. గత వారం బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 626.01 పాయింట్లు (0.74శాతం), ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 176.8 పాయింట్లు (0.68శాతం) పడిపోయాయి. మోతీలాల్ ఓస్వాల్ ఎనలిస్ట్‌‌‌‌  సిద్ధార్థ ఖేమ్కా మాట్లాడుతూ, మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్‌‌‌‌లో ఉంటుందని, క్యూ1 ఫలితాలపై దృష్టి ఉంటుందని అన్నారు.  ట్రేడ్ డీల్, క్యూ1 ఫలితాలు, ఎఫ్‌‌‌‌ఐఐల ఫ్లోలు మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయిస్తాయని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ ఎనలిస్ట్ వీ కే విజయకుమార్ పేర్కొన్నారు.