
అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ రిటెల్ చెయిన్ కేఎఫ్‌సీ దేశంలో తన 1000వ రెస్టారెంట్‌ను ఢిల్లీ సమీపంలోని డీఎల్ఎఫ్ సైబర్ హబ్‌లో ప్రారంభించింది. ఇది తమ 25 సంవత్సరాలకు పైగా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని ప్రకటించింది. కేఎఫ్‌సీ మెనూలో హాట్ అండ్ క్రిస్పీ బకెట్, జింగర్ బర్గర్, పాప్‌కార్న్ చిజ్జా, రైస్ బౌల్జ్, చికెన్ రోల్, వెజ్ వంటివి ఉంటాయి. కేఎఫ్‌సీకి ప్రస్తుతం 20కిపైగా ఆల్ -డిజిటల్ స్మార్ట్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.