
మూడేళ్ల క్రితం విడుదలై అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది ‘కేజీఎఫ్’. సీక్వెల్‌ని అంతకు మించి తెరకెక్కించామంటున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్. అసలీ సినిమా ఈ యేడు జులై పదహారునే రిలీజవ్వాల్సి ఉంది. కానీ సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే మూవీ బిజినెస్ పూర్తయ్యింది. దాంతో ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజవుతుందనుకున్నారంతా. అయితే ఎవరూ ఊహించని విధంగా వచ్చే యేడు సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని ఫిక్సయ్యారు. 2022 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ థియేటర్స్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మూవీని రిలీజ్ చేయనున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో అధీరా పాత్రలో సంజయ్‌దత్, మరో కీలక పాత్రలో రవీనా టాండన్ నటించారు.