
ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద మూడో రోజు భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. శుక్రవారం 108 హోమ గుండాలతో మహా హోమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ హోమంలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. విఘ్నేశ్వరుడి ముందు పలువురు చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ