
-
ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 1.10 కోట్లు
-
70 ఏండ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు
ఖైరతాబాద్,వెలుగు: ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాల ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చింది. ఖైరతాబాద్ గణేశ్ఉత్సవాలు మొదలై ఈ ఏడాదితో 70 ఏండ్లు అయ్యింది. అయితే ఇప్పటి వరకు భక్తుల ద్వారా వినాయకుడికి వచ్చిన ఆదాయం లెక్కలు ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ సారి ఫస్ట్‌టైమ్ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి ఆదాయాన్ని ఉత్సవ అడహక్ కమిటీ సభ్యులు సోమవారం ప్రకటించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ మధ్య హుండీల్లో డబ్బు లెక్కించగా రూ.70 లక్షలు వచ్చాయి. విగ్రహం వద్ద హోర్డింగ్స్, ఇతర ప్రకటనల ద్వారా మరో రూ.40 లక్షలు సమకూరింది. యూపీఐ ద్వారా, ఆన్‌లైన్‌ద్వారా వచ్చిన డబ్బును ఇంకా లెక్కించలేదు. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్‌గా దానం నాగేందర్, చైర్మన్‌గా రాజ్ కుమార్వ్యవహరించారు.