గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ గణేషుడు

గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ గణేషుడు

ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైర‌తాబాద్ గణేషుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 3 దగ్గర మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం ఇవాళ(మంగళవారం) సాయంత్రం విజ‌య‌వంతంగా పూర్త‌యింది. మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నాన్ని తిల‌కించేందుకు భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. నిమ‌జ్జ‌నాని ముందు గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి నిర్వాహ‌కులు గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. బై బై గ‌ణేషా అంటూ భక్తులు చేసిన నినాదాల‌తో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప‌రిస‌రాలు మార్మోగిపోయాయి.

మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర‌.. భ‌క్తుల సంద‌డి మ‌ధ్య శోభాయమానంగా సాగింది. కరోనా వైరస్‌ కారణంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. ఈ ఏడాది వైరస్‌ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గింది.. అలాగే నిమ‌జ్జ‌నాలను ఎక్కడికక్కడ ఉన్న చెరువులల్లో చేశారు భక్తులు.  అయితే ఎప్పటి మాదిరిగానే అనవాయితీ ప్రకారం బాలాపూర్ గణేష్ డితో శోభాయాత్ర ప్రారంభమైంది.. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ప్రసాద వేలంను రద్దు చేశారు నిర్వాహకులు.