ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్ మహాగణపతి  శోభాయాత్ర కొనసాగుతోంది.  63 అడుగుల గణనాథుడు  హుస్సేన్ సాగర్ లో  నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు.  ఉదయం 9 : 30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకునే అవకాశం ఉంది. పోలీసులు భారీ బందోబస్తు చేశారు.  11 రోజులు విశేష పూజలు అందుకున్న లంబోదరుడిని చివరిసారిగా చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.  అర్థరాత్రి 12 గంటలకు గణనాథుడు చివరి పూజ అందుకున్నాడు.  

అర్ధరాత్రి వరకు మెట్రో  సర్వీసులు

గణనాథుల​ శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం  6 గంటల నుంచి అర్ధరాత్రి  1 గంట వరకు మెట్రో రైల్ సర్వీసులు నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది. చివరి రైలు అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరి 2 గంటలకు డెస్టినేషన్​కు చేరుకుంటుంది.

ఆర్టీసీ.. 535 స్పెషల్ బస్సులు

నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ 535 స్పెషల్ బస్సులను నడుపనుంది. జీహెచ్​ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్​ నం. 9959226154, కోఠి బస్ స్టేషన్​నం. 9959226160ను సంప్రదించాలి.