ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం
  • కొత్త దుస్తులు అందించిన ఎమ్మెల్యే

యాదాద్రి, వెలుగు  : భువనగిరి నియోజకవర్గంలోని నాతాళ్లగూడెం, బండసోమారం గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లలో గృహ ప్రవేశం జరిగింది. గురువారం వలిగొండ మండలం నాతాళ్లగూడెంలోని జూకంటి మనోహర తన ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో గృహ ప్రవేశానికి ఎమెల్యే కుంభం అనిల్ కుమార్​ రెడ్డిని ఆహ్వానించారు. గృహ ప్రవేశానికి వచ్చిన ఆయన లబ్ధిదారు కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు పెట్టారు. 

లబ్ధిదారులందరూ త్వరగా ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం నమాత్​పల్లి, బండసోమారం, కంచనపల్లి, తుక్కపురం, గౌస్​నగర్, ఎర్రబెల్లి, కేసారం, బాలంపల్లి, రామచంద్రాపురం, పెంచికల్​పహాడ్​లో హెచ్​ఎండీఏ నిధులతో చేపట్టే పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.