Kishkindhapuri: మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ‘కిష్కింధపురి’.. డబ్బింగ్ పనుల్లో బెల్లంకొండ..

Kishkindhapuri: మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ‘కిష్కింధపురి’.. డబ్బింగ్ పనుల్లో బెల్లంకొండ..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.  ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. గురువారం నుంచి డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో  రిలీజ్ చేశారు మేకర్స్. తన శక్తివంతమైన స్వరం  ‘కిష్కింధపురి’ ప్రపంచానికి మరింత ప్లస్ అవుతుందని పోస్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ సినిమాపై ఆసక్తి పెంచాయి. హీరో, హీరోయిన్‌లకు ఎదురయ్యే భయంకరమైన అనుభవాలతో టీజర్ విజువల్స్ వణుకు పుట్టించాయి. కథాంశాన్ని పూర్తిగా వెల్లడించకుండానే, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా టీజర్ లో చూపించారు.

ఒక మిస్టరీని ఛేదించే పనిలో హీరో ఉన్నట్లుగా, అనుపమ భయంతో వణికిపోతున్నట్లుగా చూపించిన షాట్స్ సినిమాపై అంచనాలను పెంచేలా చేశాయి. అలాగే, చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్‌తో కలిసి హారర్ ఎఫెక్ట్‌ను రెట్టింపు చేసింది. ప్రతి షాట్‌కు సరిపడా సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ మూవీ  సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.