ఆగస్టు 24న గంగాధరలో జనహిత పాదయాత్ర : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆగస్టు 24న గంగాధరలో జనహిత పాదయాత్ర :  మంత్రి పొన్నం ప్రభాకర్
  • హాజరుకానున్న పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి 
  • వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 24న చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టబోతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 

కరీంనగర్ డీసీసీ ఆఫీసులో గురువారం పాదయాత్ర కోఆర్డినేటర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూట్ మ్యాప్ కోఆర్డినేటర్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఈనెల 24న గంగాధర మండలం ఉప్పర మల్యాల  నుంచి కురిక్యాల చౌరస్తా మీదుగా గంగాధర వరకు జనహిత పాదయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. ఈ జనహిత పాదయాత్ర ప్రతి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మొదట దశలో జరుగుతుందని, ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 19 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ, వారికి అందుతున్న తీరుపై ఆరా తీస్తూ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. 

24న సాయంత్రం పాదయాత్ర తర్వాత గంగాధరలో బస ఉంటుందని, 25న ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం, మొక్కలు నాటే కార్యక్రమంలో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల యజమానులు, సోలార్ యజమానులు, ఇందిరా క్యాంటీన్ యజమానులుగా ఉన్న మహిళా సంఘాల సభ్యులతో ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఇష్టాగోష్టి ఉంటుందన్నారు. 24న సాయంత్రం గంగాధరలో జరిగే కార్యక్రమాన్ని వెలిచాల రాజేందర్ రావు, పద్మాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి,  వైద్యుల అంజన్ కుమార్, భాస్కర్ రెడ్డి అనుబంధ సంఘాల నేతలు సమన్వయం చేస్తారని తెలిపారు.