నవంబర్ 9న ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల సభ

నవంబర్ 9న ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల సభ

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈనెల 9న ఖమ్మం సిటీలోని జడ్పీ మీటింగ్ హాల్ లో ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల సభ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు రవి మారుత్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా డాక్టర్ ఎల్ఆర్ఎస్ ప్రసాద్, ప్రతిమా సాహి, వేంపల్లే షరీఫ్, వెల్దంగి శ్రీధర్ హాజరుకానున్నారని తెలిపారు.

 ‘లోపలేదో కదులుతున్నట్లు’ పలమనేరు బాలాజీ కవిత్వానికి ఖమ్మం ఈస్తటిక్స్ రూ.40 వేల పురస్కారం, ప్రత్యేక ప్రశంసకు రూ.5 వేల పురస్కారాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తేనె కల్లు, అంజమ్మ, కావలి లాంటి కథ పురస్కారాలకు కూడా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు