ఖమ్మం టౌన్/పాల్వంచ/అశ్వారావుపేట,వెలుగు: జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితం చేసిన గొప్ప నాయకుడు, దివంగత సీఎం కొణిజేటి రోశయ్య అని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేశ్వి పాటిల్ అన్నారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్లతోపాటు ఆయా చోట్ల నాయకులు ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా, పలు రాష్ట్రాల గవర్నర్ గా విశిష్ట సేవ లందించిన రోశయ్య మచ్చలేని రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారన్నా రు. ఖమ్మంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, పాల్వంచలో యువజన క్రీడా శాఖ అధికారి ప రంధామరెడ్డి, బీసీ సంక్షేమ అధికా రి విజయలక్ష్మి, లీడ్ బ్యాంకు మే నేజర్ రామిరెడ్డి, అశ్వారావుపేటలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు శీమకుర్తి శ్రీనివాసరావు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
