ఖమ్మం సీసీఎస్ పోలీసులకు సీపీల ప్రశంసలు

ఖమ్మం సీసీఎస్ పోలీసులకు సీపీల  ప్రశంసలు

ఖమ్మం టౌన్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీస్ స్టేషన్‌‌‌‌లో నమోదైన చోరీ కేసులో నిందితులను పట్టుకున్న ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌‌‌‌ప్రీత్ సింగ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. 

చోరీ అనంతరం పశ్చిమ బెంగాల్‌‌‌‌కు చెందిన ముగ్గురు నిందితులు రైలులో ఖమ్మం మీదుగా పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన వరంగల్ పోలీసులు ఖమ్మం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ సిబ్బంది ఖమ్మంలో రైలు ఎక్కి తనిఖీలు నిర్వహించి, మధిర వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వరంగల్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీసీఎస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.