.ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 80కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
చేనేత లక్ష్మి పొదుపు స్కీంను వినియోగించుకోండి
చేనేత లక్ష్మి పొదుపు స్కీంను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నెలకు రూ.500 చొప్పున 9 నెలలపాటు పొదుపు చేస్తే ప్రభుత్వం పదో నెల ముగిసిన తర్వాత 60 శాతం కలిపి టెస్కో షోరూమ్ నుంచి దుస్తుల కొనుగోలుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.
కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలి
మండలాల ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని కలెక్టర్అనుదీప్ఆదేశించారు. ప్రజావాణికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఆర్వో పద్మశ్రీని ఆదేశించారు.
జిల్లాలో మంత్రులు, వీఐపీ కార్యక్రమాల సమయంలో ప్రోటోకాల్ తప్పిదాలు ఉండొద్దన్నారు. కార్యక్రమాల్లో అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, హ్యాండ్లూమ్స్ ఏడీ, టెస్కో డివిజినల్ మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
