ఖమ్మం ఖిల్లా రోప్ వే తో పర్యాటక అభివృద్ధి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం ఖిల్లా రోప్ వే తో పర్యాటక అభివృద్ధి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఖిల్లా కు రోప్ వే నిర్మించడంతో పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఆయన శుక్రవారం పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఖిల్లా రోప్ వే ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులకు బల్లెపల్లి వద్ద మంచి విలువైన భూమి పట్టాలను పరిహారంగా అందిస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, అధికారులు, తదితరులు ఉన్నారు. 

శుభ్రతతోనే వ్యాధుల నియంత్రణ

పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవడంతోనే సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం నగరం 3వ డివిజన్ బల్లేపల్లి రెయిన్‌బో నగర్ లో ప్రజలకు దోమల వల్ల సంక్రమించే సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు.  పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, డెంగ్యూ వ్యాధితో అలర్ట్​గా ఉండాలని కలెక్టర్​ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్​వో కళావతి బాయి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్​స్పెక్టర్ షేక్ బాబు ఉన్నారు.

లే- ఔట్ పనులు స్పడీప్​ చేయాలి 

ఖమ్మం మున్నేరు అభివృద్ధి పనులతో పాటు అవసరమైన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పురోగతి అభివృద్ధి పనులు, భూ సేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చే లే -ఔట్ పనులపై అధికారులతో సమీక్షించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సవసరమైన భూ సేకరణలో భూ నిర్వాసితులకు స్థలాలు ఇవ్వనున్న లే ఔట్ పనుల పురోగతిని, ప్రధాన రహదారి, 10 మీటర్ల ఓవర్ బ్రిడ్జి నిర్మాణ నమునా తదితర అంశాలను అధికారులు వివరించారు.  రిటైనింగ్ వాల్ వర్కింగ్ మ్యాప్ ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.