ఎవ్రీ చైల్డ్ రీడ్స్ లో పిల్లలను భాగస్వామ్యం చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎవ్రీ చైల్డ్ రీడ్స్ లో పిల్లలను భాగస్వామ్యం చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి 

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంలో పిల్లలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి సూచించారు. పిల్లల పఠన సామర్థ్యం పెంపునకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లు, పాఠశాల సిబ్బందితో  ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం మొదటి దశను విజయవంతంగా అమలు చేసిన టీచర్లకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రెండో దశపై టీచర్లు అందించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం కార్యచరణ సిద్ధం చేశామన్నారు. పదాలు చదివే సామర్థ్యం ఉన్న పిల్లలు వ్యాఖ్యలు చదివేలా, అక్షరాలను చదివే పిల్లలు పదాలు చదివేలా సామర్థ్యం పెంపునకు కృషి చేయాలన్నారు.

 జనవరి మొదటి వారం వరకు 75 శాతం విద్యార్థులకు వ్యాఖ్యలు చదివే సామర్థ్యం రావాలని సూచించారు. ఎంఈవోలు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో యాప్ లో అప్ డేట్  చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి చైతన్య జైని, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్ రామకృష్ణ, సీఎంవో ప్రవీణ్, కాంప్లెక్స్ హెచ్ ఎంలు, ఆర్పీలు, అధికారులు పాల్గొన్నారు. 

ఎన్నికల ప్రక్రియ  పూర్తయ్యేంత వరకు కోడ్ అమలు

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ అనుదీప్​ ఒక ప్రటనలో తెలిపారు.  ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్  సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.