చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం :  సీపీ సునీల్ దత్

చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం :  సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు : అక్రమ ఇసుక రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ ఆఫీస్​లో కల్లూరు డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు. సరిహద్దు నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన కేసులు నమోదు చేసి సీజ్ చేయాలన్నారు. గంజాయి రవాణాను అడ్డుకోవడానికి స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌‌‌‌ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

అదేవిధంగా రేషన్ బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు లేదా మిల్లులకు తరలకుండా గోదాములు, వాహనాలపై నిఘా పెంచి, కఠినమైన కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఏసీపీ వసుంధర యాదవ్, ఏసీపీ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీపీ రఘునాథపాలెం పీఎస్​ను సందర్శించారు. స్టేషన్​నిర్వహణ, రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. పెండింగ్​ కేసులపై ఆరా తీశారు.